ఖమ్మంలో కలకలం: తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో సోదాలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన  నేతలు, ఆ పార్టీ అభ్యర్ధుల ఇళ్లలో వరుస సోదాలు కలకలం రేపుతున్నాయి.  అధికారపార్టీ  నేతలే ఈ సోదాల వెనుక ఉన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.
 

Police Searches in Tummala Nageswara Rao house in Khammam lns


ఖమ్మం: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత  తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో  బుధవారంనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన రెండు నివాసాల్లో  పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులతో పాటు ఈసీ అధికారులు కూడ ఉన్నారని  సమాచారం. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  35 వేల బోగస్ ఓట్లను చేర్పించారని  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంత్రి అజయ్   సూచన మేరకు కలెక్టర్, ఆయా మున్సిపాలిటీల  కమిషనర్లు  బోసగ్ ఓట్లను చేర్పించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయమై  ఎన్నికల అధికారులకు , జిల్లా కలెక్టర్ కు  ఫిర్యాదు చేసినా ఫలితం లేదని  ఆ ఫిర్యాదులో  తుమ్మల నాగేశ్వరరావు  ప్రస్తావించారు. ఈ ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  శ్రీసిటీ నివాసంలో  పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ  కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల  ఇళ్లపై  ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన  వ్యాఖ్యలు  చేశారు.

also read:ఆ ఐదు నియోజకవర్గాల్లో 35 వేల దొంగ ఓట్లు: ఈసీకి తుమ్మల ఫిర్యాదు

తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  గతంలో బీఆర్ఎస్ లో ఉన్నారు.  ఈ ఏడాది జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో వైపు ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

also read:ఆ రెండు ఎన్నికల్లో ఒక్క సీటే: ఖమ్మంపై బీఆర్ఎస్ ఫోకస్

పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  బరిలోకి దిగాలని తుమ్మల నాగేశ్వరరావు  భావించారు. అయితే  సిట్టింగ్ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది.దీంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును  కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఆ పార్టీ ఆహ్వానం మేరకు  తుమ్మల నాగేశ్వరరావు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కొత్తగూడెం అసెంబ్లీ స్థానం సీపీఐకి కేటాయించడంతో  పాలేరు నుండి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖమ్మం నుండి తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. పాలేరు నుండి  ఖమ్మం స్థానానికి  తుమ్మల నాగేశ్వరరావును  మార్చే విషయమై ఎఐసీసీ  నేతల మధ్య  చర్చ జరిగింది.కాంగ్రెస్ నేతల సూచన మేరకు  తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుండి పోటీ చేస్తున్నారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios