దిశ హత్యోదంతం దేశం మొత్తాన్ని కలిచివేసింది. ఈ కేసులో నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కుక్కలను కాల్చినట్లు కాల్చిపడేశారు. కాగా... నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. తెలంగాణ పోలీసులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

AlsoRead justice for disha: న్యాయం జరిగింది.. ఎన్టీఆర్!...

కాగా... ఎన్ కౌంటర్ పై ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ సుందర్ స్పందించారు.  ఎవరైనా తన కుమార్తెల జోలికొస్తే అలాగే చంపేందుకు సిద్ధపడేదానినని ఆమె పేర్కొన్నారు. వెటర్నరీ వైద్యురాలు దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. 

AlsoRead ‘దిశ’ను ఎక్కడైతే సజీవదహనం చేశారో.... అదే స్థలంలో.....

దీనిపై ఇవాళ ఉదయం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ కుష్బూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.   చటాన్‌పల్లి వద్ద నిందితులు దిశకు నిప్పంటించిన చోటే ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఘటనా స్థలంలో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో.. ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు హతమయ్యారు