తప్పుడు పత్రాలు సృష్టించారంటూ భూ యజమాని వింవీఎస్ చౌదరి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది

ఆంధ్రప్రదేశ్ లో కాబోయే ఎంఎల్సీపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో 3.37 ఎకరాల భూమి విషయంలో మోసం చేసాడంటూ అనంతపురం ఎంల్సీ దీపక్ రెడ్డిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. ఇతరుల భూమిని తనది చెప్పి, తప్పుడు పత్రాలు సృష్టించారంటూ భూ యజమాని వింవీఎస్ చౌదరి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసును ఫిబ్రవరి 7వ తేదీన ఆర్ధిక నేరాల విభాగం శైలేష్ సక్సెనా తదితరులతో పాటులో దీపక్ రెడ్డిపైన కూడా కేసు నమోదు చేసింది కాగా దీపక్ రెడ్డి ఈ కేసులో ఏ5గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం క్రైంపోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.