కర్నాల్‌లో అరెస్టైన ఉగ్రవాదులు ఆదిలాబాద్‌కి: ఆయుధాల తరలింపుపై ఆరా

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో అరెస్టైన నలుగురు ఉగ్ర అనుమానితులను తెలంగాణలోని ఆదిలాబాద్ కు తీసుకురానున్నారు పోలీసులు. ఆదిలాబాద్ నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఎలా తరలించేందుకు ప్లాన్ చేశారనే విషయమై ప్రశ్నించనున్నారు.

Police Planning To Terrorists Bring From Haryana To Adilabad For Investigation


హైదరాబాద్:Haryana  రాష్ట్రంలో అరెస్టైన నలుగురు ఉగ్రవాదులను  Adilabad కు తీసుకురానున్నారు నిఘా వర్గాలు. ఆదిలాబాద్ నుండి ఆయుధాలు సరఫరా చేయాలని పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. అయితే ఈ విషయమై పోలీసులు ఆరా తీయనున్నారు. ఆదిలాబాద్ నుండి Maharashtra కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలించాలని కూడా ఉగ్రవాదుల ప్లాన్ గా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నెల 5న  హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో Pakistanతో సంబంధాలు ఉన్న టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:హర్యానాలో నలుగురు టెర్రరిస్టుల అరెస్ట్: ఆదిలాబాద్‌లో తెలంగాణ పోలీసుల సోదాలు

 గురుప్రీత్, అమన్ దీప్, పర్మీందర్, భూపేంద్రలను ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

 అరెస్టైన  నలుగురితో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వ్యక్తి టచ్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను డ్రోన్‌ల సాయంతో పాకిస్తాన్ నుంచి పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్‌ జిల్లాకు ఆయుధాలు పేలుడు పదార్థాలు, మందుగుండు పంపుతున్నట్లు తేలింది. 

పాక్ జాతీయుడి ఆదేశాల మేరకు వాటిని భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తోంది గురుప్రీత్ ముఠా. కాగా.. ఈ ముఠా గత 9 నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేశారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు ఆయుధాలను, మందుగుండను ఈ ముఠా చేరవేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.

అరెస్ట్ చేసిన న‌లుగురు కూడా khalistan terrorists ఉగ్రవాద సంస్థ  అయిన బ‌బ్బ‌ర్ ఖాల్సా ఇంట‌ర్నేష‌న‌ల్ BKI సంస్థ‌కు చెందిన‌వారుగా పోలీసులు పేర్కొంటున్నారు. వీరిని ప‌ట్టుకోడానికి పంజాబ్ ఐబీ పోలీసులు, హ‌ర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించారు. 

పాకిస్తాన్ లో ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఖలీస్థానీ ఉగ్రవాదీ రిండాతో నిందితులకు సంబంధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు.  భూపేంద్ర సింగ్, వర్మేంర్ సింగ్ లను విచారణ తర్వాత జ్యుడిషీయల్ రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు నిందితులైన అమన్‌దీప్ సింగ్, గురుప్రీత్ సింగ్ లను న్యాయ స్థానం అనుమతితో ఆదిలాబాద్ జిల్లాకు తరలించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఆదిలాబాద్ లో ఎవరికి ఎక్కడ ఆయుధాలు అప్పగించాలనే అంశంపై పోలీసులు ఆరా తీయనున్నారు. పాకిస్తాన్ నుండి రిండా ఆదిలాబాద్ కు చెందిన లోకేషన్ ను మాత్రమే షేర్ చేసినట్టుగా నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని సమాచారం.  నిందితులకు హవాలా ద్వారా రూ.22 లక్షలు అందినట్టుగా పోలీసులు గుర్తించారు. 

కర్నాల్ లో అరెస్టైన నిందితులు ఆదిలాబాద్ నుండి ఆయుధాలు తరలించాలని ప్లాన్ చేసినట్టుగా విచారణలో ఒప్పుకోవడంతో Telangana పోలీసులు కూడా అలెర్ట్ అయ్యారు.ఈ నెల 6 వ తేదీన తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు ఈ విషయమై ఆరా తీశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios