హర్యానాలో నలుగురు టెర్రరిస్టుల అరెస్ట్: ఆదిలాబాద్‌లో తెలంగాణ పోలీసుల సోదాలు


ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ జిల్లాలో ఉగ్రవాదులకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.హర్యానాలో అరెస్టైన ఉగవాదులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana  Police On High Alert As Khalistanis caught with explosives in Haryana

ఆదిలాబాద్: Adilabadజిల్లాలో Telangana ఇంటలిజెన్స్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం నాడు Haryana లో పట్టుబడిన Terrorists ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మీదుగా నాందేడ్ మీదుగా RDS సరఫరా చేయాలని ఉగ్రవాదుల నుండి ఆదేశాలు అందాయి.నిర్మల్, భైంసా మీదుగా నాందేడ్ కు బాంబులు సరఫరాపై కూడా ఆరా తీస్తున్నారు ఇంటలిజెన్స్ పోలీసులు. నాందేడ్ నుండి ఢిల్లీ వెళ్లే రూట్లను కూడా Police జల్లెడ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో కొత్త వ్యక్తులు కన్పించారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఆదిలాబాాద్ జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు మాత్రం ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. హర్యానాలో పట్టుబడిన ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం విషయమై పోలీస్ ఉన్నతాధికారులు కూడా హర్యానా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  హర్యానాలో పట్టుబడిన ఉగ్రవాదులు ఆదిలాబాద్ జిల్లా నుండి ఆర్డీఎక్స్ ను సరఫరా చేయాలని ప్లాన్ చేశారు. ఈ విషయమై హర్యానా అధికారులతో తెలంగాణ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఈ సమాచారం ఆధారంగా తెలంగాణ పోలీసులు అనుమానితులపై దృష్టి పెట్టనున్నారు. గతంలో టెర్రరిస్టులతో జిల్లాకు చెందిన వారికి సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Haryana లోని కర్నాల్‌లో Pakistan ఉగ్రవాదులతో సంబంధం గల నలుగురిని  పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన పక్కా సమాచారంతో బస్తారా టోల్ ప్లాజా వద్ద వాహనంలో వెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు ఫిరోజ్ పూర్‌కు చెందిన వాళ్లు కాగా  ఒకరు లూధియానా వాసి. 

నిందితులను గురుప్రీత్, అమన్ దీప్, పర్మీందర్, భూపేంద్రగా గుర్తించారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు ఈ ఆయుధాలను తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చేరవేసేందుకు వెళ్తున్నట్లు విచారణలో చెప్పారు. హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురితో పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వ్యక్తి టచ్‌లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను డ్రోన్‌ల సాయంతో పాకిస్తాన్ నుంచి పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్‌ జిల్లాకు ఆయుధాలు పేలుడు పదార్థాలు, మందుగుండు పంపుతున్నట్లు గుర్తించారు. పాక్ జాతీయుడి ఆదేశాల మేరకు వాటిని భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తోంది గురుప్రీత్ ముఠా. ఈ ముఠా గత 9 నెలలుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బాంబులు, మారణాయుధాలు చేరవేశారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు ఆయుధాలను, మందుగుండను ఈ ముఠా చేరవేసింది. 

అరెస్ట్ చేసిన న‌లుగురు కూడా ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ  బ‌బ్బ‌ర్ ఖాల్సా ఇంట‌ర్నేష‌న‌ల్ బీకేఐ సంస్థ‌కు చెందిన‌వారుగా పోలీసులు పేర్కొంటున్నారు. వీరిని ప‌ట్టుకోడానికి పంజాబ్ ఐబీ పోలీసులు, హ‌ర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించారు. ఈ న‌లుగురు అనుమానిత ఉగ్ర‌వాదుల వ‌య‌స్సు 20 నుంచి 25 సంవ‌త్స‌రాల మ‌ధ్య వుంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. వీళ్లు పంజాబ్ నుంచి నాందేడ్ బ‌య‌ల్దేరుతుండ‌గా హ‌ర్యానాలోని బ‌స్తారా టోల్ ప్లాజా వ‌ద్ద పట్టుబడ్డారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios