Asianet News TeluguAsianet News Telugu

ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి వాహనాల అనుమతి: తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలు


హైదరాబాద్:  కరోనాను కట్టడి చేసేందుకుగాను ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు ఆంక్షలను మరింథ కఠినంగా అమలు చేస్తున్నారు. 

police permits vehicles having E-pass at AP-Telangana border lns
Author
Nalgonda, First Published May 23, 2021, 9:31 AM IST

హైదరాబాద్:  కరోనాను కట్టడి చేసేందుకుగాను ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు ఆంక్షలను మరింథ కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్ ను మిరంత కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు డీజీపీ  మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. శనివారం నాడు  వీడియో కాన్ఫరెన్స్ లో  లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేయాలని  డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. శనివారం నుండి వీటిని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించాలంటే ఈ పాస్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

also read:హైదరాబాద్‌: భారీగా వాహనాల సీజ్, కేసులు.. రోడ్డుపైకి రావాలంటే జంకుతున్న జనం

ఈ పాస్ విషయం తెలియని  చాలామంది ప్రయాణీకుల వాహనాలు తెలంగాణ ఏపీ సరిహద్దుల్లోనే నిలిచిపోయాయి. రాష్ట్రంలో 20 గంటల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ పాస్ ఉంటేనే  రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.  దీంతో సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్ పోస్టులు  తెలంగాణ పోలీసులు మూసేశారు. గుంటూరు జిల్లాకు సరిహద్దులోని పొందుగుల, నాగార్జునసాగర్ వద్ద  ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో వాహనాలను నిలిపివేశారు. శుక్రవారం వరకు   ఈ పాస్ లేకున్నా ఉదయం  10 గంటలలోపుగా వాహనాలు అనుమతించేవారు.

కర్నూల్, గద్వాల జిల్లాలకు సరిహద్దుల్లోని పుల్లూరు చెక్ పోస్టు వద్ద కూడ వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు వైపులా పెద్ద ఎత్తున రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోవడంతో తాత్కాలికంగా ఈ పాస్ లేకుండానే  వాహనాలను అనుమతించారు.  ఈ పాస్  లేకున్నా అంబులెన్స్ లతో పాటు అత్యవసర వాహనాలను  మాత్రం తెలంగాణలోకి అనుమతి ఇస్తున్నారు. ఈ పాస్ విషయం తెలియని చాలా మంది ప్రయాణకులు రోడ్లపైనే ఎదురు చూస్తున్నారు. ఈ పాస్ తీసుకొంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పడంతో  ఈ పాస్ కోసం ప్రయాణీకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో  ఏపీకి చెందిన  పోలీసు ఉన్నతాధికారులు తెలంగాణకు చెందిన పోలీసులతో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios