ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భారీగా భక్తులు: మండపం మూసివేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు నిరాశ తప్పడం లేదు. పోలీసులు ఖైరతాబాద్ వినాయక మండపాన్ని మూసివేయించారు.

Police locked khairatabad ganesh temple

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు నిరాశ తప్పడం లేదు. పోలీసులు ఖైరతాబాద్ వినాయక మండపాన్ని మూసివేయించారు.

గణేశ్ మండపాలకు అనుమతి లేదని కోర్టు ఆదేశాల మేరకే మూసివేసినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో గణనాధుడి దర్శనం కాకుండానే నిరాశతో వెనుదిరుగుతున్నారు భక్తులు.

కరోనా టైం కావడంతో వినాయక మండపాలకు, సామూహిక ప్రార్ధనలకు తెలంగాణలో అనుమతి లేదు. అయితే ప్రతీసారి భారీ ఎత్తున కొలువుదీరే ఖైరతాబాద్ వినాయకుడి సైజ్ తగ్గిపోయింది.

ప్రార్థనల వరకు మినహాయించి, కేవలం పూజలు, కైంకర్యాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు ఎప్పటిలాగే ఖైరతాబాద్ వస్తుండటంతో పోలీసులు వారిని తిప్పి పంపుతున్నారు.

కాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి విగ్రహం నిర్మాణాన్ని కేవలం 9 అడుగులకే పరిమితమయ్యాడు. కోవిడ్‌కి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతి కొలువుదీరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios