టోలీచౌకి బ్యాంకు వద్ద లాఠీచార్జ్ క్యూలో ఉన్నవారిని చితగ్గొట్టిన పోలీసులు

నెల రోజులు దాటినా పెద్ద నోట్ల రద్దు సమస్యలు తీరకపోవడంతో కామన్ మెన్ కు కోపం వచ్చింది.

ఇన్నాళ్లు ఓపికగా క్యూలో నిలబడి పైసా చేతికి అందకపోయినా లైట్ గానే తీసుకున్నసామాన్యుడికి ఇప్పుడు కోపం కట్టలు తెంచుకుంది.

హైదరాబాద్‌లోని టోలిచౌకి ఎస్‌బీఐ బ్రాంచ్‌ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బ్యాంకు వద్ద బారులు తీరిన ఖాతాదారులు డబ్బుల కోసం క్యూలో ఉన్న సమయంలో పోలీసులు వారిని నియంత్రించలేక లాఠీలకు పనిచెప్పారు.

దీంతో ఆవేశానికి లోనైన ఖాతాదారులు అక్కడే ఆగి ఉన్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. రోడ్డుపైన ధర్నా చేపట్టి వాహనాలను అడ్డుకున్నారు.