Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌ బైరామల్‌గూడలో కలకలం: తలలేని డెడ్‌బాడీ లభ్యం

హైదరాబాద్ నగరంంలోని ఎల్బీనగర్ కు సమీపంలోని బైరామల్‌గూడలో తలలేని మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Police found without head at Bairamalguda in Hyderabad
Author
Hyderabad, First Published Nov 12, 2021, 3:27 PM IST


హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ బైరామల్‌గూడ వద్ద తలలేని మృతదేహం కలకలం రేపుతుంది. ఈ డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీులకు సమాచారం ఇచ్చారు. డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అయితే తలలేని మృతదేహం ఎవరిదనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డెడ్‌బాడీ తల పరిసర ప్రాంతాల్లో ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.గతంలో హత్యలు చేసిన తర్వాత మృతదేహల తలలను వేరే ప్రదేశంలో వదిలిన కేసులు కూడా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి. ఈ తరహ హత్యలు ఎక్కువగా గ్యాంగ్ స్టర్ నయీం చేసేవాడని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అయితే గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ లో మరణించాడు. అయితే ఇదే తరహలో ఘటన చోటు చేసకోవడంపై  లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయస్సు 25 ఏళ్లుగా ఉంటుందని  పోలీసులు అనుమానిస్తున్నారు.

పంజాగుట్టలో  ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో వారం రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుండి నిందితులను హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు పోలీసులు. బెంగుళూరులో బాలికను చంపి hyderabad లోని పంజాగుట్టలో చిన్నారి డెడ్‌బాడీని వదిలివెళ్లారు. ద్వారకపురి కాలనీలోని మూసి ఉన్న దుకాణం వద్ద చిన్నారిని వదిలిన మహిళ మెహిదీపట్టణం వెళ్లినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.ఈ చిన్నారి హత్య కేసును సీరియస్ గా తీసుకొన్న పోలీసులు నాలుగైదు బృందాలుగా ఏర్పడి నిందితులను వారం రోజుల్లో అరెస్ట్ చేశారు. బెంగుళూరులో హత్య చేసిన చిన్నారిని హైద్రాబాద్ పంజాగుట్టలో ఎందుకు వదిలేశారనే విషయమై కూడా పోలీసులు నిందితులను విచారించనున్నారు.చిన్నారిని హత్య చేసిన ఘటనలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు హైద్రాబాద్ కు తీసుకొస్తున్నారు. అయితే ఈ చిన్నారి ఎవరు.. హత్య చేసింది ఎవరనే విషయమై హైద్రాబాద్ పోలీసులు మీడియాకు వివరించనున్నారు. 

also read:హైద్రాబాద్‌లో మహిళా టెక్కీ మిస్సింగ్: పోలీసుల గాలింపు

మరో వైపు మహిళా టెక్కీ భార్గవి మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.హైద్రాబాద్ నగరంలో మహిళా టెక్కీ భార్గవి బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని చెప్పి ఇంటినుండి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె నగరంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. బుధవారం నాడు సాయంత్రం ఇంటి నుండి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బ్యూటీపార్లర్ వద్దకు వెళ్లినా కూడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తెలిసిన వారికి ఫోన్ చేసిన భార్గవి గురించి కుటుంబసభ్యులు విచారించారు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  Hyderabad నగరంలో ఆమె నడుచుకొంటూ తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.పంజాగుట్ట నుంచి మలక్‌పేట వరకు వెళ్లింది. తన దగ్గర ఉన్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ముసారాంబాగ్ వద్ద రోడ్డుపై  Bhargavi పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

పంజాగుట్ట సెంట్రల్ వద్ద  భార్గవి  బస్సు ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ ఎందుకో బస్సు ఎక్కలేదు. ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లింది. కాచిగూడ రైల్వే స్టేషన్ వద్దకు రైలు ఎక్కకుండా పంజాగుట్టకు ఆమె వచ్చింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయని పోలీసులు తెలిపారు.హైద్రాబాద్ పోలీసులు గతంలో కూడా మిస్సింగ్ కేసులను శాస్త్రీయమైన ఆధారాలతో చేధించారు. అయితే  భార్గవి మూసారాంబాగ్ వద్ద ఫోన్ ను పారేసినట్టుగా గుర్తించారు. తన ఆచూకీ లభ్యం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఆమె ఫోన్ ను పారేసిందా  లేదా పొరపాటున ఫోన్ పోగోట్టుకుందా అనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios