పుట్టమధు చుట్టూ బిగిస్తున్న ఉచ్చు: 12 బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 2 కోట్ల నగదు బదిలీ
లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు ముందు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన అంశానికి సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు.
కరీంనగర్: లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు ముందు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధు రూ. 2 కోట్లు డ్రా చేసిన అంశానికి సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు మంథని మున్సిపల్ చైర్ పర్సన్ శైలజను రూ. 2 కోట్ల విషయమై విచారిస్తున్నారు.
12 బ్యాంకు అకౌంట్ల ద్వారా పుట్ట మధుకు ఇతరుల మధ్య నగదు బదిలీలు చోటు చేసుకొన్నాయని పోలీసులు గుర్తించారు. పుట్ట మధుతో పాటు మరో 12 మంది మధ్య రూ. 2 కోట్ల లావాదేవీలు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.బిట్టు శ్రీను, కుంట శ్రీను, కమలాపూర్ కి చెందిన వెదిరె సత్యనారాయణతో పాటు రాయిచూరు, న్యూఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్తల బ్యాంకు ఖాతాల నుండి పుట్ట మధు బ్యాంకు ఖాతాల మధ్య బ్యాంకు లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.
also read:షాక్: పుట్ట మధుతో సన్నిహితంగా ఉన్న పోలీసులపై బదిలీ వేటు
కుంట శ్రీను నిర్మిస్తున్న ఇంటి నిర్మాణానికి పుట్ట మధు సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రూ. 2 కోట్లు ఎవరి చేతులు మారాయనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. పుట్ట మధు పోలీసుల విచారణలో నోరు మెదపడం లేదని సమాచారం. వామన్ రావు దంపతుల హత్య జరిగిన సమయంలో కుంట శ్రీను పుట్ట మధులు కలిశారా.. లేదా అనే విషయమై ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.