హైదరాబాద్: కృష్ణ జింకల వేట కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కృష్ణ జింక మాంసం తరలిస్తున్న సమయంలో  ఇద్దరిని హైద్రాబాద్ పోలీసులు  మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

కవ్వాల్ పారెస్ట్ కేంద్రంగా కృష్ణ జింకల వేట  సాగుతోందని పోలీసుల విచారణలో తేలింది. శంకర్ బాబా కృష్ణ జింకల వేట సాగిస్తున్నట్టుగా పోలీసులు తేల్చారు.

తన పొలంలో జింకల కోసం శంకర్ బాబా వలలను ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వలలో చిక్కుకొన్న జింకల మాంసాన్ని శంకర్ బాబా విక్రయిస్తున్నాడు. 

నిజామాబాద్ లోని తన స్నేహితుడి ద్వారా హైద్రాబాద్ లో జింక మాంసాన్ని విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.  రెండు జింకలున్నాయని హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఉద్యోగికి సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు జింక మాంసం కోసం ఆర్డర్ ఇచ్చారు.

also read:నిజామాబాద్‌లో వేట: జింక మాంసంతో హైద్రాబాద్‌కి, ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్

తన వద్ద ఉన్న జింకను చంపి మాంసాన్ని శంకర్ బాబా పంపాడు. ఈ క్రమంలోనే మంగళవారం నాడు హైద్రాబాద్ లో ఇద్దరు అరెస్టయ్యారు. జింకలను వేటాడేందుకు హైద్రాబాద్ నుండి శంకర్ బాబు షూటర్లను రప్పిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.ఇప్పటికే నిర్మల్ జిల్లాలో శంకర్ బాబాపై జింకలను వేటాడిన కేసులున్నాయి.