వైష్ణవి హత్య: ఆటోలో దొరికిన వెంట్రుకలు ఎవరివి?

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 28, Aug 2018, 11:51 AM IST
police found hair in auto near vaishnavi deadbody
Highlights

 రంగారెడ్డి జిల్లా ఆల్మాస్‌గూడలో వైష్ణవి అనుమానాస్పద మృతి కేసులో  ఓ ఆటోలో వెంట్రుకలు లభించాయి. వీటిని పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్‌కు పంపారు.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆల్మాస్‌గూడలో వైష్ణవి అనుమానాస్పద మృతి కేసులో  ఓ ఆటోలో వెంట్రుకలు లభించాయి. వీటిని పరీక్షల నిమిత్తం పోలీసులు ల్యాబ్‌కు పంపారు.

వైష్ణవిపై అత్యాచారం చేసి.. హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడ వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి మృతదేహం లభించిన ప్రదేశానికి సమీపంలోని ఓ ఆటో వద్ద డాగ్‌స్వాడ్  ఆగింది.

ఈ ఆటోలో  వెంట్రుకలు స్వాధీనం చేసుకొన్నారు.  ఈ ఆటో యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వైష్ణవి మృతదేహం లభించిన చర్చి ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు.  తెల్లవారుజామున ఓ కారు ఆ ప్రాంతంలో తిరిగినట్టుగా  సీసీ కెమెరాలో రికార్డైంది.

మృతదేహం ఉన్న ప్రాంతం వైపుగా  కారు వెళ్లలేదు.  అయితే ఆటో వరకు డాగ్‌స్వ్యాడ్ ఎందుకు వెళ్లిందనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఆటోలో దొరికిన వెంట్రుకలు  వైష్ణవివేనా ఇంకా మరేవరివైనా  అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.  వైష్ణవి మృతదేహన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు  ఎదురుచూస్తున్నారు.

మృతదేహం తడిసి  ఉంది. అయితే వర్షానికి ఆమె మృతదేహం తడిసిందా.. లేక ఎవరైనా ఆమెను నీళ్లలో ముంచి చంపారా అనే కోణంలో కూడ పోలీసులు  ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసులో  పోస్టు మార్టమ్ నివేదిక ఆధారంగా దర్యాప్తును మరింత లోతుగా సాగించాలని పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

ఈ వార్తలు చదవండి

వైష్ణవి హత్యలో ట్విస్ట్: రేప్ చేసి, చంపి ఆటోలో తెచ్చి పడేశారు

రంగారెడ్డి జిల్లాలో దారుణం


 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader