రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వాకింగ్ కు వెళ్లిన విద్యార్థినిని అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బాలాపూర్ మండలం, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వాకింగ్ కు వెళ్లిన విద్యార్థినిని అత్యంత దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన బాలాపూర్ మండలం, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో చోటుచేసుకుంది.
రాజీవ్ గృహకల్పలోని పదోబ్లాక్‌లో నివాసం ఉంటున్న అనసూయ, ప్రభు దంపతుల కుమార్తె వైష్ణవి. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళుతున్నానంటూ వైష్ణవి బయటకు వెళ్లింది. ఎంతసేపటికి వైష్ణవి తిరిగిరాకపోవడంతో ఆమె కోసం వెతికారు. ఎక్కడా వైష్ణవి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం ఉదయం అల్మాస్‌గూడ, రాజీవ్ గృహకల్ప దగ్గరలోని చర్చి సమీపంలో వైష్ణవి శవమై కనిపించింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వైష్ణవి ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుంది. తమకు ఎవరితోనూ విబేధాలు లేవని, తమ కుమార్తె ప్రతి రోజూ స్కూలుకు వెళ్లి వస్తోందని తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే వైష్ణవిని ఆమె మేనమామ పెళ్లి చేసుకుంటానని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వైష్ణవి హత్యలో అతని ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.
