మూసినదిలో ఇద్దరు మహిళల మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. వారి హత్యకుగల అసలు కారణాలు బయటపడ్డాయి. మద్యం మత్తులో ఓ వ్యక్తిని గెలిచేయడమే.. వారి ప్రాణాలు పోవడానికి కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బరగూడెం గ్రామానికి చెందిన యాదమ్మ(50), సుమిత్ర(40)లు సోమవారం సాయంత్రం కల్లు కోసం కంచన్ బాగ్ వెళ్లారు.  సాయంత్రం 6 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో యాదమ్మ భర్త రాజు ఫోన్‌ చేసి విచారించాడు. వస్తున్నామంటూ యాదమ్మ భర్తకు చెప్పింది. 

అయితే.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కల్లు కాంపౌండ్ వద్ద ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో కలిసి రోజూ కల్లు తాగేవారు.కాగా.. సోమవారం కూడా అతనితో కలిసి కల్లు కాంపౌండ్ వద్ద తాగిన వారు.. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ వ్యక్తితో కలిసి అత్తాపూర్ బ్రిడ్జ్‌ కింద ఉన్న మూసీ తీరానికి చేరుకున్నారు. పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే బ్రిడ్జ్‌ పిల్లర్‌ నెం.118 కింది భాగంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ కూడా మళ్లీ కల్లు సేవించారు. మద్యం డోస్ ఎక్కువ అయ్యి.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. తమ స్నేహితుడిని గేలి చేశారు. నీకు ఏది చేతకాదు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. వారి మాటలు విని తట్లుకోలేక పోయిన ఆ వ్యక్తి.. పక్కనే ఉన్న బంబరాయితో వారి తల మోదీ హత్య చేశాడు. ప్రాణాలు పోయినట్లు అనిపించకపోవడంతో వారి చీరలతో గొంతు బిగించేశాడు. మద్యం మత్తులో ఉండటంతో..వారు తిరిగి ప్రతిఘటించలేక.. అక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళల మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించినట్లు వారు చెప్పారు. 

read more news

మూసీనదిలో మృతదేహాలు.. వీడిన మిస్టరీ

మూసీ నదిలో మహిళల మృతదేహాలు: క్షుద్రపూజల అనుమానం