హైదరాబాద్ మూసీనదిలో బుధవారం ఇద్దరు మహిళల మృతదేహాలు కొట్టుకువచ్చిన సంగతి తెలిసిందే. క్షుద్రపూజలు చేసి చంపేశారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కాగా.. ఆ ఇద్దరు మహిళల చావు మిస్టరీ వీడింది. ఆ ఇద్దరు మహిళలు అక్కాచెల్లెళ్లు అని పోలీసులు గుర్తించారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బరగూడెం గ్రామానికి చెందిన యాదమ్మ(50), సుమిత్ర(40)లు సోమవారం సాయంత్రం కల్లు కోసం కంచన్ బాగ్ వెళ్లారు.  సాయంత్రం 6 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో యాదమ్మ భర్త రాజు ఫోన్‌ చేసి విచారించాడు. వస్తున్నామంటూ యాదమ్మ భర్తకు చెప్పింది. 

ఆ తర్వాత వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. తీరా.. అత్తాపూర్ మూసీ నదిలో శవాలై కనిపించారు. వారు హత్యకు గురయ్యారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ జంట హత్యలకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మహిళల మెడలోని నగల కోసం హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

read more news

మూసీ నదిలో మహిళల మృతదేహాలు: క్షుద్రపూజల అనుమానం