హైదరాబాద్ మూసీనదిలో గుర్తు తెలియని ఇద్దరు మహిళల మృతదేహాలు కొట్టుకురావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. లంగర్‌హౌస్‌ వద్ద నదిలో ఇద్దరు గుర్తు తెలియని మహిళల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిని ఎవరైనా హత్య చేసి నదిలో పడేశారా..?లేక ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు సోమవారం పౌర్ణమి కావడంతో క్షుద్రపూజలు జరిగి వుండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇద్దరు మహిళల మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.