ప్రగతి భవన్కు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత..
హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ లో జరిగిన అవకతవకలను సవరించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. అయితే ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటారు. ప్రగతి భవన్ వద్దకు చేరుకుంటున్న యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్ లో జరిగిన తప్పులను సవరించాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 7 మల్టిపుల్ ప్రశ్నలకు సంబంధించి హైకోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్, ఫిజికల్ ఈవెంట్స్ పాత పద్ధతి అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.