Asianet News TeluguAsianet News Telugu

మంత్రి తలసాని తనయుడు సాయికిరణ్ పై కేసు నమోదు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు, గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన సాయికిరణ్ యాదవ్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. 

police case filed on minister talasani son saikiran yadav
Author
Hyderabad, First Published Nov 7, 2021, 1:08 PM IST

హైదరాబాద్‌: తెలంగాణ సినిమాటోగ్రపి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ పై హైదరాబాద్ లో పోలీస్ కేసు నమోదయ్యింది. సాయికిరణ్ నిర్లక్యంగా కారు నడిపి తనను గాయపర్చినట్లు ఓ వ్యక్తి ఫిర్యాదు  చేయడంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దీపావళి పండగ తర్వాతి రోజయిన శుక్రవారం హైదరాబాద్ లో సదర్ ఉత్సవం జరిగింది. ఖైరతాబాద్ లో జరిగిన ఉత్సవాల్లో minister talasani srinivas yadav తనయుడు సాయికుమార్ పాల్గొన్నారు. 

read more  ఆ వీడియోలు నా దగ్గరున్నాయి.. ఇక ఆట మొదలైంది కేసీఆర్ : ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

అయితే ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తుండగా talasani saikiran yadav కారు రైల్వే గేట్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళుతున్న సంతోష్(32)ను ఢీకొట్టింది. కారు పాదంపైనుండి పోవడంతో గాయపడిన అతడు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందాడు.  

ఈ గాయం నుండి కాస్త కోలుకున్నాక సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో తలసాని సాయికిరణ్ పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని... పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. 

గతంలో కూడా సాయికిరణ్ పై పలు ఆరోపణలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ మాజీ ఎంపీ  కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావును ఓ వివాదం నేపథ్యంలో సాయికిరణ్ కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగింది. గీత కూడా తన భర్తను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు ఫిర్యాదు కూడా చేసింది. అయితే తన కొడుకుపై వచ్చిన కిడ్నాప్ ఆరోపణలను మంత్రి తలసాని కొట్టిపారేసారు. కేవలం గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని మాత్రమే తన కొడుకు అడిగారని తలసాని తెలిపారు. 

ఇదిలావుంటే ఈ సారి ఖైరతాబాద్‌లోనూ ఎంతమాత్రం తగ్గకుండా సదర్ ఉత్సవాలు జరిగాయి. నారాయణగూడ కంటే మించి ఉత్సవాలు నిర్వహించారు. సదర్ కోసం నగరంలోని యాదవ్‌లు పంజాబ్, హర్యానాల నుంచి దున్నరాజులను కొని తెచ్చారు. 

read more  సదర్ ఉత్సవాలకు సన్నద్ధత.. నగరానికి ఖరీదైన హర్యానా దున్నలు.. సదర్ చరిత్ర ఇదే..!

ఉత్సవాలకు ముందుగానే తెచ్చి వాటికి నాణ్యమైన దానా పెట్టి బలిష్టంగా తయారుచేసారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత డ్రైఫ్రూట్స్, అరటి పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం అందిస్తారు. దున్నపోతుల వీపులపై వెంట్రుకలు లేకుండా చేస్తారు. ఆవాల నూనెతో మర్దన చేస్తారు. 

ఈ సదర్ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నేతలు రేవంత్ రెడ్డి, ధర్మపురి అరవింద్, దానం నాగేందర్, రఘునందన్ రావు, ఇతర ప్రముఖులూ పాల్గొన్నారు. 

హైదరాబాద్‌లో గొల్ల, కుర్మల ఐక్యత లక్ష్యంగా సదర్ వేడుకలు పుట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. కొన్ని దశాబ్దాల క్రితం నగరంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానున్న గొల్ల, కుర్మలను ఏకం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలకు చౌదరి మల్లయ్య యాదవ్ జీవం పోశారు. 1946లో ఈ వేడుకలు ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. నిజాం కాలంలోనూ గొల్ల, కుర్మలు కలుసుకుని తమ పశుసంపదపై చర్చలు చేసుకునేవారు. గొల్ల, కుర్మలు శ్రద్ధతో పెంచిన తమ పశుసంపదను ప్రదర్శించడమే సదర్ వేడుకల్లో ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios