అధికార యంత్రాంగం అంతా సీఎం కేసీఆర్‌ ఒత్తిడికి లొంగి పనిచేసిందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ . సీఐలు, ఎస్సైలు స్థానిక నాయకులను బెదిరించారని...పోలీసులు బెదిరించిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయని రాజేందర్ అన్నారు

అబద్దాలు చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (telangana cm kcr) వెన్నతో పెట్టిన విద్య అన్నారు కేంద్ర మంత్రి (union minister) కిషన్ రెడ్డి (kishan reddy) . హుజూరాబాద్‌ ఉపఎన్నికలో (huzurabad bypoll) ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఈటల రాజేందర్‌ను (etela rajender) కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ (bandi sanjay), జితేందర్‌రెడ్డి, వివేక్‌ (vivek), బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ మాటలను హుజూరాబాద్‌ ప్రజలు నమ్మలేదని చురకలు వేశారు. 

నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్‌ పనిచేశారని కిషన్ రెడ్డి అభినందించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుందని జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకే దళితబంధు పథకం తెచ్చారని కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు పనిచేశారని తెలిపారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోవాలని... నిజమైన ఉద్యమకారులకు ఉద్వాసన పలుకుతున్నారని, తెలంగాణ వ్యతిరేక శక్తులు ప్రగతి భవన్‌లో ఉన్నాయని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అసలైన ఉద్యమకారులు టీఆర్ఎస్‌లో ఉండటానికి ఇష్టపడటం లేదని.. ఉద్యమ కారులు, కవులు, కళాకారులు, మేధావులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని... తెలంగాణ ప్రజలు డబ్బుకు లొంగరని హుజూరాబాద్‌ ప్రజలు నిరూపించారు అని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

Also Read:వందలకార్లు వెంటరాగా హైదరాబాద్ కు ఈటల... హుజురాబాద్ ఎమ్మెల్యేకు గ్రాండ్ వెల్ కమ్... (ఫోటోలు)

అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఇక్కడి ఎన్నికల కమిషన్ అధికారులు‌, పోలీసులు పనిచేశారని ఆరోపించారు. అధికార యంత్రాంగం అంతా సీఎం కేసీఆర్‌ ఒత్తిడికి లొంగి పనిచేసిందని ఈటల ఎద్దేవా చేశారు. సీఐలు, ఎస్సైలు స్థానిక నాయకులను బెదిరించారని...పోలీసులు బెదిరించిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయని రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే పనులవుతాయని పోలీసులు బెదిరించారని... ఒక్క ఉపఎన్నికలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని, అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఈటల ప్రశ్నించారు. కేసీఆర్‌ నాయకత్వంలో అరిష్టమైన పాలన సాగుతోందని.. 2023లో ప్రజలు టీఆర్ఎస్‌ను పాతరేసి బీజేపీని గెలిపిస్తారు అని ఈటల రాజేందర్‌ జోస్యం చెప్పారు.

తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదని రాజేందర్ అన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రజలను బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. ఈ విజయం హుజూరాబాద్‌ ప్రజలకు అంకితమిచ్చారు రాజేందర్. ఇక ఆట మొదలైందని కేసీఆర్‌‌ను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పథకం పాత ఆలోచన అని కేసీఆర్‌ చెబుతున్నారని.. పాత ఆలోచనైతే హూజూరాబాద్‌ ఎన్నిక వరకూ ఎందుకు ఆగారని రాజేందర్ ప్రశ్నించారు. దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో ఒక్క ఎస్సీ కుటుంబమైనా బాగు పడిందా.. అని రాజేందర్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఎన్నికలు వచ్చినప్పుడే కొత్త పథకాలు గుర్తుకొస్తాయని.. ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఈటల నిలదీశారు. 

విజయశాంతి (vijaysanthi) మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప పగులగొట్టారని అన్నారు. కెసిఆర్‌కి ఈటల రాజేందర్ భయపడలేదని.. తలవంచలేదని ప్రశంసించారు. దొరగారు ఉద్యమాన్ని మరిచిపోయారని.. ఆయన సీఎం అయ్యింది ఉద్యమం వల్ల డబ్బుతో కాదని రాములమ్మ చురకలు వేశారు. సమస్యలపై పోరాటమే బీజేపీ ఎజెండా అని.. కెసిఆర్ మీ స్థాయిని మీరే దించివేసుకున్నారని మండిపడ్డారు. కెసిఆర్ మీరు తప్పు చేశారని.. అనే భయంతోనే హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంకి రాలేని విజయశాంతి ఎద్దేవా చేశారు. కెసిఆర్‌కి డబ్బు జబ్బు పట్టిందని.. లక్ష కోట్ల అక్రమ సంపాదన వెనుక వేసుకున్నారని ఆమె ఆరోపించారు.