కేటిఆర్ చుట్టం రంగినేని రంగారావుపై కేసు..

కేటిఆర్ చుట్టం రంగినేని రంగారావుపై కేసు..

నేను కేటిఆర్ చుట్టాన్ని..  మీ సంగతి తేలుస్తా. మిమ్మల్ని ఒక్కరోజులో సస్పెండ్ చేయకపోతే చూడండి బాంచెత్ అని విర్రవీగిన ముసలాయన రంగారావు పై కేసు నమోదైంది. ఆయన మహిళా అధికారి అని కూడా చూడకుండా చిందులేయడం.. విఆర్ఎ ను చితకబాదడం దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ట్విట్టర్ లో ఒక వ్యక్తి ఈయనపై ఏమంటారు అని కేటిఆర్ ను ప్రశ్నించారు. దీంతో ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిజిపి మహేంద్ రెడ్డిని కేటిఆర్ ఆదేశించారు. కేటిఆర్ ట్విటర్ లో పెట్టిన పోస్టు కింద ఉంది చూడొచ్చు.

మరోవైపు విఆర్ఎ ను ఎగబడి కొట్టిన ముసలాయన రంగినేని రంగారావుపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా కేటిఆర్ చుట్టం కావడం.. కేసిఆర్ కు చెప్పి ఒక్కరోజులోనే సస్పెండ్ చేపిస్తా.. బాంచెత్ అని బెదిరించడంతో రెవెన్యూ అధికారులు కేసు పెట్టాలా వద్దా అని వెనుకడుగు వేశారు. కానీ ఈ తతంగంపై మీడియా, సోషల్ మీడియాలో దుమ్ము దుమారం కావడంతో రెవెన్యూ సిబ్బంది ధైర్యంగా వెళ్లి కేసు పెట్టారు.

దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రేణుక పిర్యాదు మేరకు పోలీసులు కొట్టి, తిట్టిన రంగినేని రంగారావు పై IPC  353, 323, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

 

రంగినేని రంగారావు ఎలా దాడి చేసిండో చూడాలంటే కింద వీడియో చూడండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page