గృహిణి పై ఓ న్యూస్ రిపోర్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో..  అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ సంఘటన  హైదరాబాద్ నగరంలోని వనస్థలీపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్‌(35) వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. పంజాగుట్టలోని ఓ పత్రికలో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్లుగా అతడి ఇంటికి సమీపంలో ఉంటోన్న గృహిణి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. 

ఇటీవల శివప్రసాద్‌ సదరు గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. ఈ నెల 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.