జాతీయ గీతాన్ని అవమానించారంటూ పోలీసులకు ఫిర్యాదు
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదైంది.జాతీయ గీతాన్ని అవమానించేలా ట్వీట్ చేశారని ఆయనపై ఆదివారం సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
సినిమా హాళ్లు దేశభక్తిని నిరూపించుకునేందుకు పరీక్ష కేంద్రాలుగా మారాయని పవన్ చేసిన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు న్యాయవాది జనార్థన్ గౌడ్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పవన్ ట్వీట్ జాతీయ గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు ఉందని జనార్థన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం వినిపించాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
