జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్టాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో ఉన్న స్నేహితుడి సూచన మేరకు గూగుల్ పే అకౌంట్ ద్వారా రూ. 5వేలను డబ్బులు బదిలీ చేసినట్టుగా కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. 

జగిత్యాలకు సమీపంలోని మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో రాజేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. మల్లాపూర్ మండలానికి చెందిన రాకేష్  కోసం కాశ్మీర్ పోలీసులు మంగళవారం నాడు  ఇక్కడికి వచ్చారు. టెర్రరిస్టులకు ఆర్ధిక సహాయం అందించినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ వ్యక్తికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాల గురించి కాశ్మీర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో  పోలీసులు రాకేష్ ను విచారిస్తున్నారు.