షామీర్ పేట కాల్పుల ఘటన: మనోజ్ అరెస్ట్
మేడ్చల్ జిల్లా షామీర్ పేట కాల్పుల ఘటనలో మనోజ్ అలియాస్ సూర్యతేజను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని షామీర్ పేటలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి నటుడు మనోజ్ అలియాస్ సూర్యతేజను పోలీసులు ఆదివారంనాడు అరెస్ట్ చేశారు. శనివారంనాడు రాత్రి సెలబ్రిటీ విల్లాలో సిద్ధార్ధదాస్ పై ఎయిర్ గన్ తో మనోజ్ కాల్పులకు దిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నారు.
సిద్దార్ద దాస్, స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే మూడు ఏళ్ల క్రితం నుండి భర్తతో స్మిత దూరంగా ఉంటుంది. 2019 నుండి స్మిత భర్తకు దూరంగా ఉంటుంది. అయితే తన ఇద్దరు పిల్లలతో స్మిత దూరంగా ఉంటుంది. అయితే కొన్ని సీరియల్స్ లలో నటించిన మనోజ్ అలియాస్ సూర్యతేజతో ఆమె సహా జీవనం చేస్తుందనే ప్రచారం సాగుతుంది. అయితే మనోజ్ తో స్మిత సహజీవనం పని చేయలేదని మనోజ్ తండ్రి చెబుతున్నారు.
స్మితతో పాటు ఈ పిల్లలు ఉంటున్నారు. అయితే తనను కొట్టారని సిద్దార్దదాస్ , స్మిత దంపతలు కొడుకు సీడబ్ల్యుసీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ విషయమై తండ్రి సిద్దార్ధదాస్ కు కూడ అతను సమాచారం చేరవేశాడు. దీంతో స్మిత వద్ద ఉన్న తన పిల్లలను తీసుకెళ్లేందుకు సిద్దార్ద దాస్ షామీర్ పేట వచ్చారు. ఈ విషయమై మనోజ్, సిద్దార్దదాస్ మధ్య గొడవ జరిగింది. ఈ విషయమై మనోజ్ ఎయిర్ గన్ తో కాల్పులకు దిగాడు. ఎయిర్ గన్ ను పోలీసులు సీజ్ చేసుకున్నారు.