హైద్రాబాద్‌లో పబ్ నుండి బాలిక కిడ్నాప్: ఒకరి అరెస్ట్, కారు సీజ్

హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో అమ్నేషియా పబ్ నుండి బాలికను కారులో తీసుకెళ్లిన కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు నిందితుడు ఉపయోగించిన కారును కూడా పోలీసులు సీజ్ చేశారు.
 

Police Arrested Man For  kidnapping minor girl From  pub in Hyderabad

హైదరాబాద్:Hyderabad నగరంలోని  జూబ్లీహిల్స్  ఓ పబ్ pub  నుండి  బాలికను కిడ్నాప్ చేసిన  కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను kidnap చేసేందుకు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఎండ్ల్యూ కారులో బాలికను నిందితుడు తీసుకెళ్లినట్టుగా పోలీసులు చెబుతున్నారు. CCTV  పుటేజీల్లో ఈ దృశ్యాలను గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. 

also read:హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. పబ్‌కు వచ్చిన మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన..

హైద్రాబాద్ లోని  పబ్ లో గత నెల 28వ తేదీన పార్టీకి సూరజ్ తో పాటు మరో వ్యక్తి బాలికను పార్టీకి పిలిచారు. మధ్యాహ్నం పూట పబ్ కు వెళ్లింది. పబ్ నుండి కారులో బాధిత బాలికను బయటకు తీసుకెళ్లారు.ఈ సమయంలో మరో ఆరుగురు అమ్మాయిలున్నారు. రెండు కార్లలో బాలికలను తీసుకెళ్లారు. అయితే కారులో బాలికపై నిందితులు అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపణలు చేస్తుంది. నిందితుల నుండి తప్పించుకన్న బాధితురాలు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు ఈ విషయమై పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ పిర్యాదు మేరకు సీసీటీవీ పుజేటీ ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలికతో పాటు వాహనంలో ఉన్న వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో ఆమె మెడపై కూడా గాయపరిచారు. అనంతరం బాలిక వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. 

ఈ విషయంపై బాలిక తండ్రి ఫిర్యాదు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 354, 323, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఇవాళ మధ్యాహ్నం ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.పార్టీ కోసం మైనర్లను లోనికి ప్రవేశించడానికి పబ్ యాజమాన్యం ఎలా అనుమతించింది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

హైద్రాబాద్ పబ్ లలో అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకొంటున్న విషయాలు గతంలో కూడా చోటు చేసుకొంటున్నాయి. పబ్ లలో నిబంధనలకు విరుద్దంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టుగా గతంలో కేసులు నమోదయ్యాయి. పబ్  నిర్వాహకులకు పోలీస్ శాఖ గతంలో కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా కూడా వారి తీరులో మార్పు రాలేదని తాజాగా ఘటన రుజువు చేస్తుంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios