Asianet News TeluguAsianet News Telugu

కొత్తూరులో మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి హత్య:ఎంపీపీ మధుసూధన్ రెడ్డి అరెస్ట్


కొత్తూరులో  మాజీ జర్నలిస్టు  కరుణాకర్ రెడ్డి  హత్య  కేసులో  ఎంపీపీ మధుసూధన్ రెడ్డిని  ఇవాళ  పోలీసులు అరెస్ట్  చేశారు.

Police Arrested Madhusudhan Reddy in Karunakar Reddy Murder Case lns
Author
First Published Apr 18, 2023, 12:08 PM IST

హైదరాబాద్: మాజీ జర్నలిస్టు  కరుణాకర్ రెడ్డి హత్య  కేసులో  కొత్తూరు ఎంపీపీ మధుసూధన్ రెడ్డిని  మంగళవారంనాడు  పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ నెల  16వ తేదీన  కరుణాకర్ రెడ్డిని  కిడ్నాప్  చేసి  హత్య  చేశారు  దుండగులు.  కొత్తూరు  ఎంపీపీ  మధుసూధన్ రెడ్డి   ఆదేశాల మేరకు కరుణాకర్ రెడ్డిని  హత్య  జరిగిందని  మృతుడి కుటుంబ సభ్యులు  ఆరోపిస్తున్నారు. 

చేగూరు నుండి  తిమ్మాపూర్  వైపునకు   బంధువు శ్రీధర్ రెడ్డి  కారులో  వెళ్తున్న  కరుణాకర్ రెడ్డిని  దుండగులు మరో కారులో అటకాయించారు.  శ్రీధర్ రెడ్డిపై దాడి  చేశారు. కరుణాకర్ రెడ్డిని  కిడ్నాప్  చేశారు.   ఓగదిలో బంధించి  కరుణాకర్ రెడ్డిని  దుండగులు కొట్టారు.  అపస్మారకస్థితిలోకి వెళ్లిన కరుణాకర్ రెడ్డిని  గచ్చిభౌలి  కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు . అయితే  కరుణాకర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు  అతడు మృతి చెందినట్టుగా  ప్రకటించారు. కరుణాకర్ రెడ్డి మృతి చెందిన  విషయం తెలియడంతో  దుండగులు పారిపోయారు.   కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం  కొత్తూరు ఎమ్మార్వో  కార్యాలయం వద్ద  డాక్యుమెంటర్ రైటర్ గా పనిచేస్తున్నాడు.  గతంలో  కరుణాకర్ రెడ్డి  ఓ దినపత్రికలో  జర్నలిస్టుగా  పనిచేశాడు.  

also read:కొత్తూరులో మాజీ జర్నలిస్ట్ కరుణాకర్ రెడ్డి హత్య కేసు: నలుగురు అరెస్ట్

కొత్తూరు ఎంపీపీ మధుసూధన్ రెడ్డికి  కరుణాకర్ రెడ్డి  అనుచరుడిగా  ఉన్నాడు.  ఇటీవల కాలంలో  వీరిద్దరి మధ్య  అగాధం  పెరిగింది. దీంతో మధుసూధన్ రెడ్డితో  కరుణాకర్ రెడ్డి దూరంగా  ఉంటున్నారు.  వీరిద్దరి మధ్య  ఓ భూమి విషయంలో  కొంత కాలంగా  గొడవలు  జరుగుతున్నాయి. ఇదే విషయమై  ఆదివారంనాడు మధుసూధన్ రెడ్డి, కరుణాక్ రెడ్డి మధ్య  గొడవ జరిగింది.  

పెద్ద మనుషుల సమక్షంలోనే  కరుణాకర్ రెడ్డిని మధుసూధన్ రెడ్డి హెచ్చరించారు.  పెద్ద మనుషులకు కూడా  మధుసూధన్ రెడ్డి వార్నింగ్  ఇచ్చారు. ఈ ఘటన  జరిగిన  కొన్ని గంటల్లోనే  కరుణాకర్ రెడ్డి  కిడ్నాప్  అయ్యాడు. కరుణాకర్ రెడ్డి కిడ్నాప్  విషయంలో పోలీసులు  సకాలంలో  స్పందించలేదని  మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కరుణాకర్ రెడ్డి హత్య  కేసులో  నిన్ననే  నలుగురు  నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios