హైదరాబాద్: తెలంగాణలో అక్రమంగా కొనసాగుతున్న కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. రాష్ట్రంలోని అమాయక ప్రజలకు డబ్బులు ఎరవేసి వారి కిడ్నాలతో వ్యాపారం చేస్తున్న ఓ ముఠా సభ్యున్నిహైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నీ రాకెట్ శ్రీలంక రాజధాని  కొలంబో కూడా తమ సామాజ్య్రాన్ని విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. 

ఈ కిడ్నీ రాకెట్ కు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అమాయకుల నుండి కిడ్నాలను కొనుగోలు చేసే నిందితుడు శ్రీలంక రాజధాని వేదికగా శస్త్రచికిత్స చేయించేవాడని తెలిపారు. ఇలా మొత్తం వ్యవహారంలో దాదాపు రూ.15లక్షల వరకు ఖర్చు చేసేవాడని... అతడికి రూ.5 లక్షల వరకు మిగిలించుకునేవాడని తెలిపారు. 

అయితే ఇటీవల ఒకరికి కిడ్నీ ఇప్పిస్తానని నమ్మించి రూ.34లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఈ క్రమంలో అతడిపై కేసు నమొదయ్యింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ  కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడింది. ఇప్పటివరకు నిందితుడు ఇలా అక్రమంగా ఏడుగురికి శస్త్రచికిత్స చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.