ఆధిపత్యం కోసం యువకుడి హత్య: రంగారెడ్డి లచ్చానాయక్ తండాలో ఐదుగురు అరెస్ట్

రంగారెడ్డి  జిల్లా మోమిన్ పేట లచ్చానాయక్ తండాలో  యువకుడు హత్యకు గురయ్యాడు.  నిందితులు  ఈ హత్యను  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే  యత్నం చేశారు. 

Police Arrested  Five  For  kIlling  Young man  In  Ranga Reddy  Lachanaik thanda lns


హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మోమిన్ పేట లచ్చానాయక్ తండాలో  దారుణం చోటు  చేసుకుంది.  తండాలో  ఆధిపత్యం కోసం  యువకుడిని  హత్య చేశారు.  అయితే  ఈ యువకుడు  రోడ్డు ప్రమాదంలో  మృతి చెందినట్టుగా  చిత్రీకరించేందుకు  నిందితులు ప్రయత్నించారు.  ఈ విషయమై  పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.  సీసీపుటేజీలో    యువకుడిని  హత్య చేసినట్టుగా  గుర్తించారు  పోలీసులు. ఈ కేసులో  ఐదుగురు నిందితులను  పోలీసులు అరెస్ట్  చేశారు.

లచ్చానాయక్ తండాలో  ఆధిపత్య పోరుతో పాటు  భూముల వివాదం ఉంది.  తండాలో  విఠల్ అనే యువకుడిది పై చేయిగా మారింది. దీంతో విఠల్ ను హత్య చేయాలని ప్రత్యర్థి వర్గం భావించింది.  దీంతో  గ్రామానికి చెందిన ఐదుగురు   మరో నలుగురితో కలిసి  విఠల్ ను హత్య చేశారు.  కర్ణాటకకు  చెందిన  తుఫాన్ వాహనంతో  విఠల్ ను  ఢీకొట్టి హత్య చేశారని  పోలీసులు  చెప్పారు.  విఠల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు  చేస్తే  ఈ విషయం వెలుగు చూసింది.  విఠల్ హత్యకు  కర్ణాటకకు  చెందిన  ముఠాతో  రూ. 1 లక్ష సుఫారీ ఇచ్చినట్టుగా  పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.  ఐదుగురు నిందితులను  ఇవాళ పోలీసులు అరెస్ట్  చేశారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios