హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి  మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ పదవికి ఈటల రాజేందర్ పేరు పరిశీలనలో ఉన్నా... స్పీకర్ పదవిని చేపట్టేందుకు ఈటల సుముఖంగా లేరు.

ఈ నెల 17వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక జరగనుంది.తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవి కోసం సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాసర్ రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

గత ప్రభుత్వంలో  పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.  పోచారం శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘ కాలం నుండి రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ దఫా పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి‌ల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు.ఈటల రాజేందర్  మాత్రం స్పీకర్ పదవిని తీసుకొనేందుకు  ఆసక్తిగా లేరు. 

గత నెలలో కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సమయంలో స్పీకర్ పదవిని తీసుకొనేందుకు  ఈటల సుముఖంగా లేరని ఆయన అనుచరులు చెబుతున్నారు.గత టర్మ్‌లో డిప్యూటీ  స్పీకర్‌గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి పేరును కూడ స్పీకర్ పదవి కోసం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

ఈ నలుగురిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వైపు కేసఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలతో  స్పీకర్ ఎన్నిక విషయమై కేసీఆర్ చర్చించినట్టు సమాచారం.  పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డికి  స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్టు చెబుతున్నారు.


సంబంధిత వార్తలు

ఈటెల నో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం?

ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఆ ఎనిమిది మంది వీరే

ఎన్నికల ఎఫెక్ట్: ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

నెలాఖరులో కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఎనిమిది మందికే ఛాన్స్?

ఈ సారైనా ఆ నలుగురికి కేబినెట్ బెర్త్ దక్కేనా