ప్రధాని నరేంద్ర మోడీ జూలై 8న తెలంగాణకు రానున్నారు . ఆ రోజున ఖాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు, వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 

మరికొద్దినెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూకడుతున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ టూర్ ఖరారైంది. జూలై 8న ఆయన తెలంగాణకు రానున్నారు. ఆ రోజున ఖాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్‌కు, వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ వెంటనే హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.