Asianet News TeluguAsianet News Telugu

భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ వేగవంతం: ప్రధాని మోడీ

శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ నగరానికి చెందిన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోందని చెప్పారు. 

pm narendra modi hails Bharat Biotech teams work on coronavirus
Author
Hyderabad, First Published Nov 28, 2020, 3:46 PM IST

శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ నగరానికి చెందిన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోందని చెప్పారు.

కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని ప్రధాని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 

అంతకుముందు మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు.

అంతకుముందు అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట వైమానిక స్థావరానికి చేరుకున్న ప్రధానికి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. హకీంపేట రోడ్డు మార్గం ద్వారా ప్రధాని జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థ వద్దకు చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios