శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్న ఇద్దరు నేతలు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వేర్వేరుగా ట్వీట్లు చేశారు. కాగా రాష్ట్రపతి తన సంతాప సందేశాన్ని తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వారిని కాపాడలేకపోయారు.

 

 

కాగా ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సమయంలో లోపల 17 మంది చిక్కుకున్నారు.

ప్రమాదంలో మరణించిన అసిస్టెంట్ ఇంజనీర్ సుందర్ నాయక్ కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇటీవలే విధుల్లో చేరారు. మరో అసిస్టెంట్ ఇంజనీరు మోహన్ కుమార్ తన సహోద్యోగులను కాపాడే ప్రయత్నం చేశారు. ఐదు నిమిషాల్లో తాను మరణిస్తున్నానని, తన వద్దకు ఎవరూ రావద్దని ఆయన మోహన్ కుమార్ అన్నట్లు తెలుస్తోంది.