ప్ర‌ధాని మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌.. భద్రతా చర్యలపై సీఎస్ సమీక్ష

Hyderabad: వరంగల్ లో సుమారు రూ.6,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రధాని నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 7న ఛత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జులై 8న ప్రధాని తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారని పీఎంవో వర్గాలు తెలిపాయి.
 

PM Modi's visit to Telangana,  CS A.Santhi Kumari reviews safety measures RMA

PM Modi to visit Telangana: ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. పీఎం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ నేప‌థ్యంలోనే ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్స్ పాటించాలని అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెలిప్యాడ్ ప్రాంతాన్ని, బహిరంగ సభా స్థలాన్ని శానిటైజ్ చేయాలని డీజీపీ అంజనీకుమార్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ను ఆదేశించారు.

కాగా, వరంగల్ లో సుమారు రూ.6,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో ప్రధాని నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 7న ఛత్తీస్ గఢ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జులై 8న ప్రధాని తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కాగా, జూలై 8న ఉదయం 10:45 గంటలకు తెలంగాణలోని వరంగల్‌కు చేరుకునే ప్రధాని అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు.

తెలంగాణలో దాదాపు రూ.6,100 కోట్ల విలువైన పలు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారని ప్రకటనలో పీఎంవో పేర్కొంది. వీటిలో రూ. 5,550 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. 68 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్-వరంగల్ సెక్షన్ NH-563ని ఇప్పటికే ఉన్న రెండు లేన్‌ల నుండి నాలుగు లేన్‌ల కాన్ఫిగరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తార‌ని స‌మాచారం. ప్ర‌ధాని మోడీ అదే రోజు సాయంత్రం 4:15 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌కు చేరుకుంటారు. అక్క‌డ దాదాపు రూ.24,300 కోట్ల విలువైన ప‌నుల‌కు  శంకుస్థాపన చేయ‌డంతో పాటు ప‌లు బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios