ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ చేరుకున్నారు. ఈరోజు ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి.. వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పీ ప్రావీణ్య, హన్మకొండ కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, వరంగల్ సీపీ రంగనాథ్, పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక కాన్వాయ్‌లోని వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. అక్కడ ప్రధాని మోదీ ప్రత్యేక పూజులు నిర్వహించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు. 6 రకాల ప్రసాదాలను సిద్దం చేశారు. ఇక, అంతకుముందు ప్రధాని మోదీ హకీంపేట ఎయిర్‌బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకున్నారు. ఇక, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వరంగల్‌లో మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లే మార్గం మొత్తం హై ప్రొటెక్షన్ జోన్‌లోకి వెళ్లింది.
ఇదిలా ఉంటే, భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం అనంతరం ప్రధాని మోదీ.. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ రూ. 6,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అందులో రూ. 521 కోట్లతో వ్యయంతో కాజీపేటలో నిర్మించనున్న వ్యాగన్ తయారీ పరిశ్రమకు, రూ. 3,441 కోట్ల ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా వరంగల్-మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు, రూ. 2,147 కోట్లతో జగిత్యాల- కరీంనగర్- వరంగల్ ఇంటర్ కారిడార్ పనులు ఉన్నాయి. తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు విజయసంకల్ప సభగా నామకరణం చేశారు. ఈ సభావేదికపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్‌లతో సహా మొత్తం 8 మంది మత్రమే కూర్చునేలా ఏర్పాటు చేశారు.
ఈ సభ అనంతరం ప్రధాని మోదీ హెలికాప్టర్‌లో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తన ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయలుదేరుతారు. ఇక, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వరంగల్ భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు.
