ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ బయలుదేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని వరంగల్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం ప్రధాని మోదీ బయలుదేరారు. ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ సమీపంలోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10:15 గంటలకు వరంగల్‌లోని మామునూరుకు వెళ్లనున్నారు. తెలంగాణ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.
‘‘రూ. 6,1000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి హాజరయ్యేందుకు వరంగల్ బయలుదేరాను. ఈ పనులు హైవేల నుంచి రైల్వేల వరకు వివిధ రంగాలను కవర్ చేస్తాయి. వాటి వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇక, ప్రధాని మోదీ వరంగల్ పర్యటన విషయానికి వస్తే.. ఉదయం 10.15 గంటలకు వరంగల్ చేరుకుంటారు. తొలుత భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉదయం 10:45 నుంచి 11:20 గంటల మధ్య కోచ్ ఫ్యాక్టరీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11:45 నుంచి 12:20 గంటల మధ్య వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తన ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయలుదేరుతారు. ఇక, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వరంగల్ భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.
