ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా హకీంపేట్‌ ఎయిర్‌బేస్‌ లో మోదీకి సీఎస్‌, డీజీపీ, సైబరాబాద్‌ సీపీ, కలెక్టర్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారత్‌ బయోటెక్‌కు బయలుదేరారు. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారీ, పురోగతిపై సందర్శించనున్నారు. 

మోదీ రాక సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకున్నారు. అక్కడి జైడస్ బయోటెక్ పార్క్‌ సందర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం అహ్మదాబాద్‌ నుంచి నేరుగా హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్‌ పర్యటన అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు చేరుకుంటారు.

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం తెలపడానికి కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అనుమతించింది. 

వీడియో

"

శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకొనే ప్రధానికి సీఎం కేసీఆర్‌ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పీఎంవోకు సమాచారమిచ్చింది. అయితే ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఫోన్లో తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ప్రధానికి స్వాగతం చేప్పడానికి హకీంపేట ఎయిర్‌ ఆఫీస్‌ కమాండెంట్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మొహంతి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపింది.