Asianet News TeluguAsianet News Telugu

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు


హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్ లో పేకాట ఆడిన కేసులో 30 పేజీల రిమాండ్ రిపోర్టును పోలీసులు సోమవారం నాడు రాత్రి ఉప్పర్ పల్లి కోర్టుకు సమర్పించారు.ఈ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు తెలిపారు.

playing Cards Case: police reveals Key information in Remand Report
Author
Hyderabad, First Published Nov 1, 2021, 7:28 PM IST


హైదరాబాద్: హీరో  Naga shourya ఫామ్‌హౌస్‌లో 30 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.అక్టోబర్ 31 వ తేదీన నాగశౌర్య ఫామ్ హౌస్‌లో పేకాట ఆడుతున్నవారిని  Sot పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అ కేసులో ఏ1గా Gutha Suman Kumar గా పోలీసులు గుర్తించారు. 30 పేజీల Remand Report పోలీసులు కోర్టుకు సమర్పించారు.

also read:హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట:30 మంది పేకాటరాయుళ్లకు 14 రోజుల రిమాండ్

పేకాట ఆడేవారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ను సుమన్ కుమార్ క్రియేట్ చేశారు.ఈ గ్రూపుల్లో పేకాట ఆడేవారితో సుమన్ కుమార్ చాటింగ్ చేసేవాడు. లక్షల్లో పేకాట ఆడేవారి కోసం సుమన్ కుమార్ లక్ష్యంగా చేసుకొనేవాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వాట్సాప్ ఛాటింగ్‌ల్లో పేకాడ ఆడే స్థలాలను సుమన్ కుమార్ చేరవేసేవాడు. 

పేకాట ఆడేందుకు వచ్చినవారు డిజిటల్ రూపంలో డబ్బులను చెల్లిస్తే సుమన్‌కుమార్ కాయిన్స్ ఇచ్చేవాడు. ఈ కాయిన్స్ ఆధారంగా పేకాటరాయుళ్లు పేకాట ఆడుతారు. ప్రతి సిట్టింగ్ లో గుత్తా సుమన్ కుమార్ పెద్ద ఎత్తున డబ్బులను సంపాదించేవాడని పోలీసులు గుర్తించారు.

ఉదయం పూట మాత్రమే సుమన్ కుమార్ పేకాట ఆడించేవాడు.బర్త్‌డే పార్టీల పేరుతో స్టార్ హోటల్స్, ఫామ్ హౌస్ లను బుక్ చేసుకొని పేకాట ఆడించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడించారని గుర్తించారు.మాదాపూర్ లోని స్టార్‌హోటల్స్ ను అద్దెకు తీసుకొని పేకాట ఆడించారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులకు దొరికితే తనదే పూచీకత్తు అంటూ ప్రచారం చేసుకొనేవాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖులతో  తనకు ఉన్న పరిచయాలు, వారితో దిగిన ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసేవాడు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వంలోని పెద్దలతో తనకు పరిచయాలు ఉన్నాయని ఆయన చెప్పుకొనేవాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.అయితే ఆదివారం నాడు మాత్రం హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో బర్త్ డే కోసం అద్దెకు తీసుకొని పేకాట ఆడించారు.

ఈ ఫామ్ హౌస్ లో సుమారు 20 కార్లతో పాటు, టూ వీలర్లు, మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు సుమారు రూ. 6.77 లక్షల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు.  
  గుత్తా సుమన్ కుమార్ చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు.ఇప్పటికే సుమన్ కుమార్ మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు. అతని కాంటాక్ట్స్‌లో పలువురు వీఐపీ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్ నంబర్లున్నట్టు గుర్తించారు. వాసవి డెవలపర్స్ రాజారాంతో సహా మరో రియల్టర్ మద్దుల ప్రకాష్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని మామిడితోటలో సైతం గుత్తా సుమన్ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న దొరికిన కారు నెంబర్ల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు

ఈ కేసులో అరెేస్టైన నిందితులను పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో ఇవాళ సాయంత్రం హాజరుపర్చారు. నిందితుల తరపున బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడు సుమన్ కుమార్ ను కస్టడీ కోరుతూ రేపు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios