Asianet News TeluguAsianet News Telugu

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట:30 మంది పేకాటరాయుళ్లకు 14 రోజుల రిమాండ్


హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. 22 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం  అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరో వైపు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని శశాంక్ గోయల్ తెలిపారు.

playing cards case:Hyderabad police sent accused  to Upparapalli Court
Author
Hyderabad, First Published Nov 1, 2021, 5:35 PM IST

హైదరాబాద్: Naga shourya ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతూ దొరికిన 30 మందిని పోలీసులు సోమవారం నాడు సాయంత్రం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు.నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న గుత్తా సుమన్ కుమార్ పోన్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు.హైద్రాబాద్ నగర శివారల్లో కొంత కాలంగా Gutha Suman Kumar పెద్ద ఎత్తున  Casino ఆడిస్తున్నారని పోలీసులు గుర్తించారు. గుత్తా సుమన్ కుమార్ పై గతంలో కేసులున్నాయని దర్యాప్తులో పోలీసులు తేల్చారు.

also read:హీరో నాగశౌర్య ఫామ్ హౌజ్‌పై పోలీసుల దాడులు.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

కచ్చితమైన సమాచారం మేరకు ఆదివారం నాడు రాత్రి రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మంచిరేవులలో గల ఫామ్‌హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారం ఆధారంగా  ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.  ఈ దాడుల సందర్భంగా 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బర్త్‌డే పేరుతో సుమన్ కుమార్ ఈ ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకొన్నారని సమాచారం. సుమన్ కుమార్ ఫోన్ లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నేతల నెంబర్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అయితే 48 గంటల  నుండి  గుత్తా సుమన్ కుమార్ ఎవరెవరికి ఫోన్లు చేశారనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకు గాను సుమన్ కుమార్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు.పోలీసులను చూసి కొందరు పేకాటరాయుళ్లు పారిపోయారని సమాచారం.

గుత్తా సుమన్ కుమార్  పై గతంలో  ఎక్కడెక్కడ కేసులున్నాయనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు ఉద్యోగాల పేరుతో మోసం చేశారని సుమన్ కుమార్ పై కేసులు నమోదైన విషయాన్ని కూడ పోలీసులు గుర్తించారు.ఈ ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతూ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య పోలీసులకు చిక్కాడు.

పలువురు ప్రముఖులను సుమన్ కుమార్ పేకాట ఆడించేందుకు రప్పిస్తున్నాడనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే సుమన్ కుమార్ పేకాట ఆడిస్తున్నాడా..నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే తరహలో సెంటర్లను తెరిచాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఫామ్ హౌస్ లో సుమారు 20 కార్లతో పాటు, టూ వీలర్లు, మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు సుమారు రూ. 6.77 లక్షల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు.

 గుత్తా సుమన్ కుమార్ చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు.ఇప్పటికే సుమన్ కుమార్ మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు. అతని కాంటాక్ట్స్‌లో పలువురు వీఐపీ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారవేత్తలు, ప్రముఖుల ఫోన్ నంబర్లున్నట్టు గుర్తించారు. వాసవి డెవలపర్స్ రాజారాంతో సహా మరో రియల్టర్ మద్దుల ప్రకాష్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని మామిడితోటలో సైతం గుత్తా సుమన్ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న దొరికిన కారు నెంబర్ల ఆధారంగా పోలీసులు విచారిస్తున్నారు

బెయిల్ పిటిషన్ కొట్టివేసిన  కోర్టు

నిందితుల తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కుమార్ కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ నిందితులు

బడిగె సుబ్రమణ్యం (వ్యాపారవేత్త, ఫిలింనగర్)
నాగార్జున (ప్రైవేట్ ఉద్యోగి, సికింద్రాబాద్)
పండితాపు సురేష్ (జ్యువెలరీ వ్యాపారి, గుంటూరు)
కైతారపు వెంకటేష్ (జ్యువెలరీ వ్యాపారి, గుంటూరు)
మిర్యాల భానుప్రకాష్ (వ్యాపారవేత్త, హైద్రాబాద్)
పాతూరి తిరుమల్‌రావు (ప్రైవేట్ ఉద్యోగి, విజయవాడ)
గుమ్మడి రామస్వామి (సివిల్ కాంట్రాక్టర్, హైద్రాబాద్)
నడిగ ఉదయ్ (డైరెక్టర్, హైద్రాబాద్)
సిహెచ్ శ్రీనివాసరావు(వ్యాపారి, మచిలీపట్టణం)
మారీడు తరుణ్(వ్యాపారి, విజయవాడ)
శివరామకృష్ణ (వ్యాపారవేత్త, హైద్రాబాద్)
వీర్ల శ్రీకాంత్ (సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, హైద్రాబాద్)
మద్దుల ప్రకాష్(వ్యాపారవేత్త, రంగారెడ్డి)
సీవీఎస్ రాజారామ్(వ్యాపారవేత్త, మాదాపూర్)
కె.మల్లిఖార్జున్ రెడ్డి(వ్యాపారవేత్త, నంద్యాల)
మిర్యాల భానుప్రకాష్(వ్యాపారవేత్త, హైద్రాబాద్)
బొగ్గారపు. నాగరాజు,(వ్యాపారవేత్త, నంద్యాల)
పాతూరి తిరుమల్ రావు(ప్రైవేట్ ఉద్యోగి, విజయవాడ)
గట్టు వెంకటేశ్వరరావు(జ్యువెలరీ వ్యాపారి, తెనాలి)
ఎస్ఎస్ఎస్ రాజు (ప్రైవేట్ ఉద్యోగి, విశాఖపట్టణం)
యు. గోపాలరావు (వ్యాపారవేత్త, మాదాపూర్)
బి. రమేష్ కుమార్ (వ్యాపారవేత్త,మల్కాజిగిరి)

కాంపల్లి శ్రీనివాస్ (వ్యాపారవేత్త, కూకట్‌పల్లి)
ఇమ్రాన్ ఖాన్, (వ్యాపారవేత్త, నిర్మల్)
టి.రోహిత్ (వ్యాపారవేత్త, హైద్రాబాద్)
 


 


 

Follow Us:
Download App:
  • android
  • ios