Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కు పిజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి రాజీనామా..

జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన పిజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 

PJR son Vishnu Vardhan Reddy resigns from Congress - bsb
Author
First Published Oct 28, 2023, 11:00 AM IST

హైదరాబాద్ : పిజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ రెండో జాబితాలో జూబ్లీహిల్స్ టికెట్ తనకు రాకపోవడం పై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అజారుద్దీన్ కి జూబ్లీహిల్స్ టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 

ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్.. జూబ్లీహిల్స్ లో విష్ణువర్ణన్ కు టికెట్ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ టికెట్ ను మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కు కేటాయించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన విష్ణువర్ణన్ రెడ్డి తన అనుచరులతో సమావేశం అయి, చర్చించిన తరువాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios