బ్యుటిషియన్ ఓ జేబు దొంగ: అరెస్టు, రూ.25 లక్షలు రికవరీ

Pickpocket arrested, over Rs 25 lakh recovered
Highlights

ఓ బ్యుటిషియన్ జేబు దొంగగా మారింది. 

హైదరాబాద్: ఓ బ్యుటిషియన్ జేబు దొంగగా మారింది. కదులుతున్న రైళ్లలో జేబులు కొడుతున్న ఆ మహిళను రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి సికింద్రాబాదులో సోమవారం అరెస్టు చేశారు. 

ఆమెను 454 ఏళ్ల మురుగేషన్ దేవిగా గుర్తించారు. గత ఐదు నెలల కాలంలో ఆమె 11 నేరాలకు పాల్పడిందింది. ఆమె నుంచి పోలీసులు మొబైల్ ఫోన్ ను, 770 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ రూ.25.44 లక్షలు ఉంటుందని అంచనా. 

దేవి భర్త మురుగేషన్ ఆటో డ్రైవర్. కూతురు బహుళ జాతి సంస్థలో పనిచేస్తోంది. కొడుకు కాలేజీలో చదువుతున్నాడు. మహిళ నేరాలను అంగీకరించినట్లు సికింద్రాబాదు రైల్వే పోలీసు సూపరింటిండెంట్ జి. అశోక్ కుమార్ చెప్పారు. 

దుస్తుల వ్యాపారం చేస్తానని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే, ఆమె సికింద్రాబాదులో బ్యూటీపార్లర్ నడుపుతున్నట్లు తేలింది. వెస్ట్ మారేడుపల్లిలోని ఓ పోష్ ఫ్లాట్ లో అద్దెకు ఉంటోంది. ఏడాది క్రితం బ్యూటీ పార్లర్ నష్టాల్లో పడింది. దాంతో ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించింది.

దొంగతనాలు చేయడానికి ఆమె పక్కా టికెట్లు కొనుక్కుని రైళ్లలో ప్రయాణించేది. రద్దీగా ఉన్న సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై, ఎస్కలేటర్లపై, మెట్లపై దొంగతనాలకు పాల్పడుతూ వచ్చింది. 

బ్యూటీ పార్లర్ బాగా నడుస్తున్న కాలంలో ఆమె లగ్జరీ లైఫ్ కు అలవాటు పడింది. దాంతో ఆ జీవితాన్నికొనసాగించడానికి దొంగతనాలకు అలవాటు పడింది.

loader