దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితులకు తగిన శిక్ష పడింది. నిందులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం తీసుకొని వెళితే... అక్కడ పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో... పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో.. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

ఎన్ కౌంటర్ వార్త వినగానే ప్రజలు సంబరాలు  చేసుకుంటున్నారు. పోలీసులపై పొగడ్తల వర్షం కురిపిస్తూ  హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైనా దిశ ఆత్మకు శాంతి కలిగిందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సీపీ సజ్జనార్ ఈ ఎన్ కౌంటర్ కథ నడిపించారని.. ఆయనకు జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.

పోలీసుల ఈ నిర్ణయం వెనుక తెలంగాణ ప్రభుత్వం ఉందని...  సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్లే... ఆ నిందితులు  ప్రాణాలు గాలిలో కలిసిపోయానని జనాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ ముద్దులొలికే చిన్నారి.. ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

AlsoRead justice for disha : 'ఇదొక ఉదాహరణ' అక్కినేని హీరోల కామెంట్స్!...

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ఓ చిన్నారి ‘ థాంక్యూ కేసీఆర్ తాత’ అనే ప్లకార్డ్ పట్టుకున్నాడు. చిన్నారి కేసీఆర్ పార్టీ రంగు గులాబీ కలర్ దుస్తులు ధరించి.. ప్లకార్డుపై కూడా  పింక్ కలర్ తో రాయడం విశేషం. దిశ హత్య కేసులో నిందితులను చంపేసి.. ప్రభుత్వం మంచి పని చేసిందనే అర్థం వచ్చేలా ఉన్న ఈ ఫోటో.. అందరినీ ఆకట్టుకుంటోంది.