గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

మరణశిక్షని సమర్ధించను కానీ.. మంచు లక్ష్మీ కామెంట్స్!

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు.  ఈ క్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. 

అక్కినేని అఖిల్ స్పందిస్తూ.. న్యాయం జరిగిందని.. ఇలాంటి సంఘటనలుజరిగినప్పుడు ఏం చేయాలనే దానికి ఒక ఉదాహరణ ఇవ్వబడింది అంటూ చెప్పుకొచ్చారు. అలానే అక్కినేని నాగార్జున కూడా సోషల్ మీడియాలో న్యాయం జరిగిందంటూ పోస్ట్ పెట్టారు.