తోచినంత ఆర్థిక సాయం చేయడం ద్వారా ఓ ప్రాణాన్ని కాపాడటమే కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమయంలో ఓ ఆడబిడ్డకు సాయం చేసినవారం అవుతాం. 

హైదరాబాద్: ప్రాణాపాయ స్థితిలో వున్న తన తండ్రిని కాపాడుకోడానికి ఓ కూతురు తాపత్రయపడుతోంది. ఇందుకోసం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. కాబట్టి ఆ ఆడబిడ్డ తండ్రి ప్రేమకు దూరం కాకుండా మనలో ఎవరైనా దాతగా మారవచ్చు. తోచినంత ఆర్థిక సాయం చేయడం ద్వారా ఓ ప్రాణాన్ని కాపాడటమే కాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమయంలో ఓ ఆడబిడ్డకు సాయం చేసినవారం అవుతాం.

అసలు విషయంలో వెళితే ప్రముఖ ఫోటోగ్రాపర్ మరియి కళాకారులు భరత్ భూషన్(67) గత 25సంవత్సరాలుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే తాజాగా అతడు నోటి క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ లో చేరారు. అయితే అతడికి కొన్ని టెస్టులు చేయించాలని డాక్టర్లు సూచించారు. కానీ ఆ టెస్టులు చేసే సదుపాయం నిమ్స్ లో లేకపోవడం డాక్టర్లు ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో చేయించుకోవాలని సూచించారు. 

అయితే ఇప్పటికే అతడి వైద్యం కోసం కుటుంబం చాలా డబ్బులు ఖర్చుచేసింది. ఇప్పుడుమరో లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఖర్చయ్యే ఈ టెస్టులు చేయించడానికి ఆ కుటుంబానికి స్థోమత లేదు. దీంతో దాతల సాయాన్ని కోరుతోంది అతడి కూతురు అనుప్రియ భరత్. అమ్మాయి తండ్రి ప్రేమకు దూరం కాకుండా వుండాలంటే ప్రతిఒక్కరు తోచినంత ఆర్థిక సాయం చేయవచ్చు. 

సాయం చేయాలనుకునే వారు ఈ కింది అకౌంట్ లో డబ్బులు జమచేయవచ్చు

పేరు: గుడిమల్ల అనుప్రియ భరత్ 

ఫోన్ నెంబర్: 9849212650

అకౌంట్ నెంబర్: 20320167401

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండయా, విద్యానగర్ బ్రాంచ్ 

ఐఎఫ్ఎస్ఈ : SBIN0003608

ఫోన్ పే చేయాలనుకునేవారు 8801503500 కు చేయాలి.