ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకేసులో కీలకమలుపు: విచారణ సిట్ కు అప్పగింత
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసును సిట్ కు అప్పగించింది ప్రభుత్వం.
హైదరాబాద్: మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో బుధవారంనాడు కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కేసు విచారణను సిట్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం . జూబ్లీహిల్స్ ఏసీపీని విచారణ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
also read:హైద్రాబాద్ లో ఉచిత హలీం ఆఫర్: హోటల్ కు పోటెత్తిన జనం, లాఠీచార్జీ (వీడియో)
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో ప్రణీత్ రావు పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఈ విషయమై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నేతలు కూడ తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురౌతున్నాయనే అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
also read:తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుండి టీజీకి మార్పు: కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణీత్ రావుపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రణీత్ రావును సిరిసిల్లలో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటాను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
also read:ఇక నుండి సెప్టెంబర్ 17న హైద్రాబాద్ విమోచన దినోత్సవం: కేంద్రం నోటిఫికేషన్
ఈ అంశానికి సంబంధించి విచారణ చేసేందుకు జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ఈ కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఇప్పటివరకు దర్యాప్తు వివరాలను సిట్ బృందం తీసుకోనుంది.
also read:గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...
ఇక నుండి సిట్ బృందం ప్రణీత్ రావును విచారించనుంది. ఈ ప్రణీత్ రావు వ్యవహరానికి సంబంధించి పోలీసులు ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.