ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: హైద్రాబాద్‌లో పది చోట్ల సిట్ సోదాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఎస్ఐబీలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారుల ఇళ్లలో  ఇవాళ సోదాలు నిర్వహించారు.

Phone Tapping case:SIT Searching in Hyderabad lns

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం నాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కసులో  సిట్ అరెస్ట్ చేసిన  ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ  ఇవాళ్టితో ముగియనుంది. అయితే  గతంలో ఎస్ఐబీలో  కీలకంగా పనిచేసిన పోలీస్ అధికారుల ఇళ్లలో  సిట్  అధికారులు  తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

తెలంగాణలో  భారత రాష్ట్ర సమితి  అధికారంలో ఉన్న సమయంలో అప్పటి  విపక్ష నేతలతో పాటు ఇతరుల ఫోన్లను కూడ ట్యాప్ చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి. ఈ విషయమై  అప్పట్లోనే విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేశారు.  అప్పట్లో  పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న  రేవంత్ రెడ్డి  ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయమై విచారణకు ఆదేశాలు జారీ చేసింది.ఈ కేసులో  ఎస్ఐబీలో  పనిచేసిన ప్రణీత్ రావును  పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రణీత్ రావును సిట్  బృందం  కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది.  ఇవాళ్టితో ప్రణీత్ రావు కస్టడీ ముగియనుంది. 

అయితే  ఇవాళ పంజాగుట్ట, సిట్ బృందం  హైద్రాబాద్ ‌నగరంలోని పది చోట్ల  గతంలో ఎస్ఐబీలో పనిచేసిన  పోలీసు అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ప్రణీత్ రావుతో పాటు పనిచేసిన పోలీస్ అధికారులను కూడ సిట్ బృందం  విచారించింది.  ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను సేకరించేందుకు దర్యాప్తు టీమ్  ప్రయత్నాలు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ను ఎవరి ఆదేశాల మేరకు చేశారు, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు,  ఫోన్ ట్యాపింగ్ లో వెల్లడైన అంశాలకు సంబంధించిన విషయాలపై దర్యాప్తు టీమ్  వివరాలను సేకరిస్తుంది. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios