నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. దీని ధాటికి ఆంధ్రప్రదేశ్‌లో భారీత వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు తుఫాను కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా పడింది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మంగళ, బుధవారాల్లో సీఎం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నిర్మితమవుతున్న వివిధ వంతెనలు, పంప్‌హౌస్‌లను సందర్శించాల్సి వుంది. అయితే తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతుండటంతో పర్యటనను వాయిదా వేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ కాళేశ్వరం పర్యటన తేదీలను త్వరలో నిర్ణయిస్తారని సీఎంవో తెలిపింది. 

పెథాయ్ సహాయక చర్యలపై డాక్యుమెంటరీ: అధికారులకు చంద్రబాబు ఆదేశం

తీరం దాటిన పెథాయ్, చంద్రబాబు సమీక్ష

పెథాయ్ తుపాను దాటికి ఆరుగురు మృతి....

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

తీరం దాటిన పెథాయ్ తుఫాన్.. తూర్పుగోదావరిలో బీభత్సం

పెథాయ్ పవర్‌ ‘‘కోనసీమ’’ మీదనేనా..?

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?