Asianet News TeluguAsianet News Telugu

యజమాని నగదు సంచి ఎత్తుకెళ్లిన పెంపుడు కుక్క.. లబోదిబోమంటున్న బాధితుడు..

ఓ పెంపుడు కుక్క యజమానికి తేరుకోలేని ఝలక్ ఇచ్చింది. అతని నగదు సంచీని ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చింది. దీంతో యజమాని లబోదిబో మంటున్నాడు. 

Pet dog stolen by owner's cash bag in warangal
Author
Hyderabad, First Published Apr 28, 2022, 10:27 AM IST

వరంగల్ : దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన కాసు చేరాలు తన రూ. 1.50 లక్షలు నిల్వ ఉన్న సంచిని Pet dog ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసిందంటూ లబోదిబోమంటున్నారు. బాధితుడు తెలిపిన ప్రకారం.. తన వద్ద ఉన్న moneyను సంచిలో నడుముకు కట్టుకుని కాపాడుకుంటుంటాడు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు సంచిని విప్పి ఓ చోట పెట్టి ఆ తరువాత మళ్లీ నడుముకు కట్టుకుంటుంటాడు. 

రెండు రోజుల క్రితం ఈ సంచిని విప్పి మంచం మీద పెట్టి స్నానం చేయడానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మంచంమీద ఉన్న పెంపుడు కుక్క లేకపోగా సంచి కన్పించలేదు. కుక్క కోసం వెతకగా.. కొన్ని గంటల తరువాత వచ్చింది. కుక్కనే సంచి ఎత్తుకెళ్లిందని.. ఎవరికైనా దొరికితే తనకు అప్పగించాలని బాధితుడు చేరాలు వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. గ్రామంలో ఇళ్లిళ్లూ తిరిగి ఆరా తీస్తున్నాడు. 

ఇదిలా ఉండగా, మార్చి 29న సిద్దిపేటలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల విశ్వాస ఘాతుకమిది. poison injections ఇవ్వడంతో వందకు పైగా dogs మృతి చెందిన ఘటన.. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో జరిగింది. గ్రామస్తుడొకరు తన పెంపుడు dog చనిపోవడంతో హైదరాబాదులోని స్టే యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. సంస్థ సభ్యులు ఆదివారం రాత్రి గ్రామానికి వచ్చి విచారించగా అసలు విషయం వెల్లడైంది. సంస్థ ప్రతినిధులు శశికళ, గౌతమ్ పలు వివరాలను విలేకరులకు వెల్లడించారు. కుక్కల బెడదపై గ్రామస్తులు పలుమార్లు పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో…  సర్పంచ్  కప్పర భాను ప్రకాష్ రావు, పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్ ఇద్దరూ కలిసి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇప్పించారు. 

విషం వల్ల వందకుపైగా లక్షణాలు చనిపోయాయని, వాటి కళేబరాలను గ్రామ పరిసరాల్లోని పాత బావుల్లో వేసి పూడ్చివేశారని తెలిపారు. ఈ విషయం మీద జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించలేదు అన్నారు. దీన్ని వారు జాతీయ జంతు సంరక్షణ సంస్థ ప్రతినిధి మేనకా గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు. తీగుల్ లో కుక్కలకు విషం ఇంజక్షన్లు ఇది చంపినట్లు ఫిర్యాదు రాగా సర్పంచి, కార్యదర్శిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. 

ఇదిలా ఉండగా, జనవరి 27న ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ మ‌హిళపై వీధి కుక్క‌లు దాడి చేశాయి. దీంతో ఆమె తీవ్ర‌గాయాల‌పాలైంది. స్థానికులు వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లే క్ర‌మంలోనే ఆమె మృతి చెందింది. ఈ ఘ‌ట‌న అమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్‌నౌరా గ్రామంలో జ‌రిగింది. బిజ్ నౌరా గ్రామానికి చెందిన 30 ఏళ్ల నథియా ఆ రోజు సాయంత్రం పశువులకు మేత వేసి ఇంటికి తిరిగి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆమెపై వీధి కుక్కలు ఎగ‌బ‌డ్డాయి. వాటి బారి నుంచి త‌ప్పించుకునేందుకు ఆమె ఎంతో ప్ర‌య‌త్నం చేసినా అవేవీ ఫ‌లించ‌లేదు. కుక్క‌లు విప‌రీతంగా రెచ్చిపోయి ఆమెను తీవ్రంగా క‌రిచాయి. ఆమె ముఖం, గొంతు, కడుపుపై ​​గాయాలు చేశాయి. దీనిని గ‌మ‌నించిన స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు. కానీ ఆలోపే మహిళ స్పృహ కోల్పోయింది. హాస్పిట‌ల్ కు తరలించే మార్గంలో ఆమె మరణించింది.

Follow Us:
Download App:
  • android
  • ios