తొమ్మిదేళ్ళ బాలుడిపై బాత్రూంలోనే లైంగికదాడి... నీచుడికి 20ఏళ్ల జైలు శిక్ష
తొమ్మిదేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి కోర్టు కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
హైదరాబాద్ : అమ్మాయిలనే కాదు అబ్బాయిలను వదిలిపెట్టడం లేదు కొందరు కామాంధులు. ఇలా అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన నీచుడిని నాంపల్లి కోర్టు కఠినంగా శిక్షించింది. బాలుడిని బెదిరించి అసహజ శృంగారానికి పాల్పడ్డ వ్యక్తికి 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు వెలువరించారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఇద్దరు కొడుకులు, ఓ కూతురితో కలిసి దంపతులు నివాసముంటున్నారు. వీరు ముస్లిం మతానికి చెందినవారు కావడంతో సోదరులిద్దరూ రోజూ సాయంత్రం మసీదుకు వెళ్లేవారు. అయితే వీరిలో చిన్నవాడైన తొమ్మిదేళ్ల బాలుడిపై మసీదులో వుండే మాల్వీ ఉర్ ఇర్ఫాన్ కన్నేసాడు. ఈ క్రమంలో 2018 మార్చి 5న బాలుడిపై మసీదులోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
రోజూ మాదిరిగానే ఆరోజు కూడా సాయంత్రం సోదరుడితో కలిసి మసీదుకు వెళ్లిన బాలుడికి ఇర్ఫాన్ మాయమటలు చెప్పి బాత్రూంలోకి తీసుకెళ్లాడు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేసాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. కానీ ఇర్ఫాన్ వికృత చేష్టల కారణంగా బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఏమయ్యిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా తనపై మసీదులో జరిగిన లైంగిక దాడి గురించి బాలుడు బయటపెట్టాడు.
Read More మూగ బాలికపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు... నీచుడికి జీవిత కాల శిక్ష
బాధిత బాలుడి తల్లిదండ్రులు వెంటనే ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో ఇర్ఫాన్ పై ఫిర్యాదు చేసారు. బాలుడికి వైద్య పరీక్షల అనంతరం లైంగిక దాడి జరిగిందని నిర్దారించుకున్న పోలీసులు ఫోక్సో తో పాటు వివిద సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. నిందితుడు ఇర్పాన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
2018 నుండి ఈ లైంగిక దాడి కేసును విచారిస్తున్న నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు బుధవారం తుది తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు న్యాయమూర్తి.