అమ్మాయిలకు స్వీట్‌పాన్‌ ఇచ్చి..

person molestation software employee hyderabad
Highlights

అఘాయిత్యానికి పాల్పడేవాడు. 

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి వికృత రూపాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ప్రఖ్యాత మయూర్‌ పాన్‌ హౌస్‌ యజమాని ఉపేంద్ర వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు రంగంలో దిగి  ఉపేందర్ గుట్టు రట్టు చేశారు.  ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలకు వలవేసి, పెళ్లిచేసుకుంటానని నమ్మించడం ఇతని నైజం. అలా దగ్గరైన అమ్మాయిలకు స్వీట్‌పాన్‌లో మత్తుమందు కలిపిచ్చి, అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి, వాటిని యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడంతోపాటు నానారకాలుగా వేధించేవాడు.  ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కాచీగూడ పోలీసులు చాక చక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఉపేందర్‌కి సహకరించిన అతడి స్నేహితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వారికోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

 

loader