Asianet News TeluguAsianet News Telugu

నమ్మారో ముంచేస్తాడు.. కనుబొమ్మలు గీకేసుకుని కోట్లాది రూపాయలు కాజేస్తాడు...

ఖమ్మంలో ఓ కేటుగాడు కనుబొమ్మలు తీసేసి, గడ్డం స్టైల్ మార్చి , రకరకాల టోపీలతో వేషాలు మార్చి వ్యాపారులకు కోట్లల్లో కుచ్చుటోపీ పెడుతున్నాడు. జిల్లాలోని పలువురు వ్యాపారులు ఈ మోసగాడి బారిన పడి కోట్లాది రూపాయల్లో నష్టాలు చవి చూశారు. 

people protest for arrest of fraud baburao in khammam - bsb
Author
Hyderabad, First Published Feb 10, 2021, 1:00 PM IST

ఖమ్మంలో ఓ కేటుగాడు కనుబొమ్మలు తీసేసి, గడ్డం స్టైల్ మార్చి , రకరకాల టోపీలతో వేషాలు మార్చి వ్యాపారులకు కోట్లల్లో కుచ్చుటోపీ పెడుతున్నాడు. జిల్లాలోని పలువురు వ్యాపారులు ఈ మోసగాడి బారిన పడి కోట్లాది రూపాయల్లో నష్టాలు చవి చూశారు. 

ఖమ్మంజిల్లా సత్తుపల్లికి చెందిన ఘరానా మోసగాడు బాబురావు ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని, అతని మీద చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళనకు దిగారు. వందలాది మందిని మోసం చేస్తూ దర్జాగా తిరుగుతున్న వైనంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల జైలునుంచి బెయిల్ మీద వచ్చి కొత్త మోసాలకు పాల్పడుతున్నాడని, ఇంటీరియర్ కంపెనీ పేరుతో తమ వద్ద సామాను తీసుకుని డబ్బులు ఎగ్గొట్టాడని వ్యాపారులు చెబుతున్నారు.

వీటితో పాటు మినరల్ వాటర్ కంపెనీల్లో వాటాల పేరుతో లక్షల రూపాయలు లూఠీ చేశాడని వాపోతున్నారు. ఇక డబ్బులు అడిగితే తన భార్యను లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ కేసులు పెడుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, సీసీఎస్, సీఐడీ, విజయవాడ, గుంటూరు పోలీస్ స్టేషన్లలో డబ్బులు అడిగిన వారి మీద ఇలా వందల కేసులు పెట్టాడని తెలిపారు. అంతేకాదు తనను గుర్తు పట్టకుండా తప్పించుకు తిరిగేందుకు నిందితుడు కనుబొమ్మలు గీకేసుకోవడం, గడ్డం స్టైల్ మార్చడం, రకరకాల టోపీలు పెట్టుకోవడం లాంటి వాటితో తన అసలు వేషాన్ని మారుస్తాడని, వీటిల్లో దిట్ట అని బాధితులు తెలుపుతున్నారు. 

అంతేకాదు బాబురావు‌పై నాన్ బెయిలబుల్ వారెంట్‌ జారీ అయినా పోలీసులు ఇప్పటివరకు అతన్ని అరెస్ట్ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios